చెన్నైలో శివాజీ కాలంనాటి ఆలయం

SMTV Desk 2017-05-27 20:27:58  Tamilnadu,Chennai, chatrapati shivaji,1677,

చెన్నై, మే 26: తమిళనాడు రాజధాని చెన్నైలోని తంబుశెట్టి వీధి, ప్యారిస్ కార్నర్ ప్రాంతంలో వెలిసి వున్న కాళికాదేవి అమ్మవారు శివపరమాత్మ కమఠేశ్వరునిగా పూజలందుకుంటున్నారు. క్రీ.శ 1677 అక్టోబరు 3వ తేదీన ఈ తల్లిని దర్శించుకుని పూజలు చేసిన ఛత్రపతి శివాజీ తదనంతరం పలు యుద్ధాల్లో విజయం సాధించాడట. ఒకప్పుడు సముద్ర తీరాన ఈ ఆలయం వుండేదనీ, ఆ తర్వాతి కాలంలో ఆలయాన్ని ఇక్కడకు మార్చారని చెపుతారు. ఆలయంలో మహావిష్ణు, కాలభైరవుడు, దక్షిణామూర్తి, నవగ్రహాలతో పాటు అగస్త్యుడు, అంగీరసుడు తదితర మునీశ్వరుల ప్రతిమలున్నాయి. ఈ ఆలయంలో దర్శన వేళలు: ఉదయం 5.30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. అమ్మను దర్శించుకున్నవారికి కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.