వచ్చేనెల నుండి అమర్నాథ్ యాత్ర

SMTV Desk 2019-06-11 18:02:22  Amarnath, amarnath yatra,

అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో పటిష్ట భద్రతా చర్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. సుమారు 46 రోజుల పాటు జరిగే యాత్రపై ఉన్నతాధికారులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. జులై 1 నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు జరిగే యాత్రకు .. గత ఏడాదికంటే రెండున్నర రేట్ల భద్రతా మోహరించాలని అధికారులు నిర్ణయించారు. 2017లో 181 కంపెనీలు, 2018లో 213 కంపెనీల పారామిలటరీ బలగాలు మోహరించారు. ఇంటెలిజెన్స్ వైఫల్యం లేకుండా ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని నిర్ణయించారు.