కజక్‌స్థాన్‌ అధ్యక్షుడిగా కస్యమ్‌ జోమార్ట్‌ టొకయేవ్‌?

SMTV Desk 2019-06-11 17:47:14  Kassym-Jomart Tokayev

కజక్‌స్థాన్‌లో జరుగుతున్న అధ్యక్ష పదవి పోటీపై తాజాగా ఎగ్జిట్ పోల్స్ నిర్వహించారు. అయితే ఎగ్జిట్ పోల్స్ లో కస్యమ్‌ జోమార్ట్‌ టొకయేవ్‌ 70 శాతం ఓట్లతో విజయం సాధిస్తారని వెల్లడించారు. కజక్‌స్థాన్‌ పబ్లిక్‌ ఒపినియన్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ను నిర్వహించింది. 70.13 శాతం ఓట్లతో టొకయేవ్‌ ముందంజలో ఉంటారని ఎగ్జిట్‌ పోల్స్‌ సూచించాయి. 15.3 శాతం ఓట్లతో యునైటెడ్‌ నేషనల్‌ పేట్రియాటిక్‌ మువ్‌మెంట్‌కు చెందిన అమిర్జాన్‌ కొసనోవ్‌ తరువాత స్థానంలో ఉంటారని ఎగ్జిట్‌ పోల్స్‌ సూచించాయి. ఎల్‌ఎల్‌పి యూత్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం టోక్‌యేవ్‌కు 69.94 శాతం ఓట్లు, కొసనోవ్‌కు 14.96 శాతం ఓట్లు రానున్నాయి. కజక్‌స్థాన్‌ రాజ్యాంగం ప్రకారం 50 శాతం పైగా ఓట్లు సాధించిన అభ్యర్ధి గెలుపొందినట్లు పరిగణిస్తారు. కజక్‌స్థాన్‌ అధ్యక్ష ఎన్నికలు స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 9 గంటలకు ముగిశాయి.