జమ్మూకశ్మీర్‌లో కాల్పులు

SMTV Desk 2019-06-11 17:20:02  encounter,

జమ్మూకశ్మీర్‌లో కాల్పులు కొన‌సాగుతున్నాయి. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య మంగళవారం ఉదయం జరిగిన ఎదురెదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హ‌త‌మ‌య్యారు. షోపియాన్ జిల్లాలోని అవనీరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే ప‌క్కా సమాచారంతో ఆర్మీ జవాన్లు మంగళవారం ఉదయం కూంబింగ్ నిర్వ‌హించారు. ఆర్మీ జవాన్లు గాలిస్తుండగా ఉగ్రవాదులు ఎదురు కాల్పులకు దిగారు. దీంతో జవాన్లు తిరిగి ఎదురుకాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల కోసం జవాన్ల గాలింపు కొనసాగుతోంది.