పవన్ కల్యాణ్ సినిమా హిందీలో రీమేక్..!

SMTV Desk 2019-06-09 15:11:06  Pawan Klayan, vicky kaushal,

టాలీవుడ్ పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా కిశోర్‌ కుమార్‌ పార్థసాని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కాటమరాయుడు’ కోలీవుడ్ సూపర్‌ హిట్ సినిమా ‘వీరం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో ఫాన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈ సినిమాను బాలీవుడ్లో రీమేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఈ బాలీవుడ్‌ రీమేక్‌లో “యూరీ” సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విక్కీ కౌశల్‌ హీరోగా నటించనున్నాడు. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌ సాజిద్‌ నదియావాలా ఈ సినిమాను నిర్మించనున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు దర్శకుడితో పాటు ఇతర సాంకేతిక నిపుణులు నటీనటుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.