మహేశ్ బాబుతో విభేదాలు లేవు

SMTV Desk 2019-06-09 15:04:52  Teja, Mahesh babu,

హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తనకు ఎటువంటి గొడవలు లేవని ప్రముఖ దర్శకుడు తేజ స్పష్టంచేశారు. మహేశ్ బాబుతో తాను తీసిన నిజం సినిమా చాలా భిన్నమైన సినిమా అని ఆయన పేర్కొన్నారు. నిజం కంటే ముందు మహేశ్ బాబు నటించిన ఒక్కడు సినిమా విడుదలైందని, ఈ సినిమాతో మహేశ్ ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయిందని తేజ చెప్పారు. దీంతో ఆ తరువాత విడుదలై నిజం సినిమా విజయం సాధించలేకపోయిందని, నిజం సినిమాలో మహేశ్ ను తాను చూపించినట్టుగా ప్రేక్షకులు చూడలేకపోయారని ఆయన తెలిపారు. మహేశ్ బాబు ఇమేజ్ నిజం కథకు అడ్డం పడడం వల్లనే ఆ సినిమా విజయం సాధించలేదని తేజ పేర్కొన్నారు. నిజం సినిమా సమయంలోనే తనకు మహేశ్ బాబుతో గొడవైందనే ప్రచారం జరిగిందని, అయితే మహేశ్ కు తనకు మధ్య ఎలాంటి గొడవలు లేవని, రావు కూడా అని ఆయన పేర్కొన్నారు. మహేశ్ బాబు అంటే ఇప్పటికీ తనకు అభిమానమేనని తేజ తేల్చి చెప్పారు.