నంద్యాల గెలుపు తర్వాత చంద్రబాబు ఇలా అన్నారు : భూమా అఖిలప్రియ

SMTV Desk 2017-08-29 17:44:36  NANDHYALA ELECTIONS, MINISTER AKHILA PRIYA, CM CHANDRABABU NAIDU.

నంద్యాల, ఆగస్ట్ 29 : నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి అఖిల ప్రియకు ఫోన్ చేశారట. ఈ గెలుపు గురించి చంద్రబాబు తనతో ఫోన్ లో మాట్లాడుతూ.. "ఈ గెలుపుతో మన ఆశయం పూర్తి కాలేదు, నంద్యాలను అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తేనే నాగిరెడ్డి తన ఆశయాన్ని పూర్తి చేసినట్టని" తనతో చెప్పినట్టు అఖిలప్రియ పేర్కొన్నారు. అమ్మాన్నానలు లేకుండా నంద్యాల సాధించిన విజయం వారిని ప్రతిక్షణం గుర్తు చేస్తుందని, వారు లేని లోటు అనుభవించిన వారికే తెలుస్తుందని తెలిపారు. తన తండ్రి భూమా నాగిరెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామని ఆమె వెల్లడించారు.