కాంగ్రెస్ ఎంపి శశిథరూర్‌కు ఉపశమనం

SMTV Desk 2019-06-08 16:13:20  shashi thakur,

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని శివలింగంపై తేలుతో పోల్చిన కేసులో కాంగ్రెస్ ఎంపి శశిథరూర్‌కు ఉపశమనం లభించింది. ఢిల్లీ కోర్టు థరూర్‌కు బెయిల్ మంజూర్ చేసింది. గతంలో శివలింగంపై కూర్చున్న తేలుతో ప్రధాని మోడీని పోల్చారు. దీంతో థరూర్‌పై బిజెపి నేతలు పరువు నష్టం దావా కేసు వేశారు. శివలింగంపై ఉన్న తేలును చెప్పుతో కొట్టలేరు, చేతితో తీయలేరని ఎద్దేవా చేశారు. హిందూ భావజాలం కలిగిన ఆర్‌ఎస్‌ఎస్ మాటాలను మోడీ లెక్కచేయడంలేదని థరూర్ విమర్శించిన విషయం తెలిసిందే. బిజెపి నేత రాజీవ్ బబ్బార్ ఆయనపై పరువు నష్టం కేసును దాఖలు చేశారు. దీంతో థరూర్ తనకు బెయిల్ మంజూర్ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. థరూర్ విజ్ఞప్తి మేరకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.