ఆర్.ఆర్.ఆర్ ఆ ఒక్క సీన్ కే 45 కోట్లు..

SMTV Desk 2019-06-08 16:12:39  rrr,

రాజమౌళి సినిమా అంటేనే విజువల్ గ్రాండియర్ గా ఉంటుంది. బాహుబలి ముందు వరకు తెలుగు పరిశ్రమకే పరిమితమైన జక్కన్న సినిమాలు బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాయి. నేషనల్ వైడ్ గా బాహుబలి సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. బాహుబలి తర్వాత రాజమౌళి సినిమా అంటే ఆ సినిమాకు మించి ఉండాల్సిందే. అందుకే ఎన్.టి.ఆర్, రాం చరణ్ తో కలిపి ఓ క్రేజీ మల్టీస్టారర్ చేస్తున్నాడు.

ఆర్.ఆర్.ఆర్ అని టైటిల్ ఎనౌన్స్ చేసిన దగ్గర నుండి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కొమరం భీమ్ గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ చేస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమాలో ఒక్క ఫైట్ సీన్ కే 45 కోట్లు ఖర్చు పెడుతున్నారట. తారక్ తో పాల్గొంటున్న ఈ యాక్షన్ సీన్ లో 2వేల మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారని తెలుస్తుంది. ఈ ఫైట్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. డివివి దానయ్య 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా 2020 సమ్మర్ టార్గెట్ తో వస్తుంది.