యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీని కలిసిన కేంద్రమంత్రులు

SMTV Desk 2019-06-08 15:56:27  upi

పలువురు బీజేపీ కేంద్రమంత్రులు యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరేందుకు.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి పహ్లాద్ జోషి, సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ థోమర్ లు సోనియా గాంధీని కలిశారు. ఈ సందర్భంగా పలు జాతీయ అంశాలు చర్చకు వచ్చినట్టు తెలిసింది. కాగా సోనియాగాంధీ వారికి తన మద్ధతు తెలిపారని కేంద్రమంత్రులు అన్నారు.