చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

SMTV Desk 2019-06-08 15:54:46  accident,

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూతలపట్టు – నాయుడుపేట జాతీయరహదారిపై ఆగివున్న లారీని వెనక నుంచి కారు ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. రేణిగుంట సమీపంలోని గురవరాజుపల్లి వద్ద ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం రుద్రవరం నుంచి తరుమలకు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.