గవర్నర్‌తో చంద్రబాబు భేటీ

SMTV Desk 2019-06-07 17:09:41  governor, chandrababu,

హైదరాబాద్‌: ఎపి మాజీ సిఎం చంద్రబాబు రాజ్ భవన్ లో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీయేనని రాజ్ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఎపి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత, చంద్రబాబు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ ఆ లేఖను ఫ్యాక్స్ ద్వారా పంపారు. ఆపై నరసింహన్ ను బాబు కలవలేదు. ఈ కారణంతోనే చంద్రబాబు రాజ్ భవన్ కు వెళ్లినట్టు సమాచారం. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.