మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి కి ఊరట

SMTV Desk 2019-06-07 16:57:15  Gali janardhan reddy,

కర్ణాటక మాజీ మంత్రి.. మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి తన సొంత జిల్లా బళ్లారి వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. అస్వస్థతతో ఇంటెన్సివ్ కేర్ లో చికిత్స పొందుతున్న తన మామను పరామర్శించేందుకు బళ్లారి వెళ్లేందుకు అనుమతి కావాలంటూ గాలి జనార్ధన్ రెడ్డి గురువారం పిటీషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ ఇందుకు సంబంధించి గాలి జనార్థన్ రెడ్డికి అనుమతిని మంజూరు చేసింది.

అయితే 2008లో కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో అప్పటి బీఎస్ యడ్యూరప్ప ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మూడు సంవత్సరాలకు ఓబులాపురం మైనింగ్ అక్రమాలపై సీబీఐ గాలి జనార్థన్ రెడ్డిని అరెస్ట్ చేసింది. 2015లో షరుతులతో కూడిన బెయిల్ ను న్యాయస్థానం మంజూరు చేసింది. దీంతో గాలి జనార్థన్ రెడ్డి బళ్లారి, అనంతపురం, కడప జిల్లాలకు వెళ్లవద్దని షరతులు విధించిన విషయం తెలిసిందే.