టీఆర్ఎస్ కి వార్నింగ్ ఇచ్చిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్

SMTV Desk 2019-06-06 15:51:21  raja singh,

తెలంగాణలో బీజేపీ మెల్ల మెల్లగా బలపడటాన్ని సీఎం కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారని బీజేపీ నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. కేంద్రంలో ఎవరి సహాయం లేకుండా ఒంటరిగానే ప్రభుత్వన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ సాధించిందని అది కూడా కేసీఆర్‌కు మింగుడుపడడంలేదని ఆయన అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కేవలం ఒకే ఒక్క స్థానాన్ని దక్కించుకున్న కార్యకర్తలలో ఆత్మ స్థైర్యం కోల్పోలేదని ప్రతి ఒక్క కార్యకర్త రెట్టింపు శ్రమతో పని చేసిన కారణంగా లోక్‌సభ ఎన్నికలలో 4 స్థానాలను సంపాదించుకున్నామని రాజాసింగ్ అన్నారు. తెలంగాణలో 2024 ఎన్నికలలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని కూడా ఆయన అన్నారు.

అయితే సీఎం కూతురు కవిత నిజామాబాద్‌లో ఓడిపోవడం అక్కడ బీజేపీ అఖండ మెజారిటీని సొంతం చేసుకోవడం చూసిన కేసీఆర్‌కు బీజేపీ ముందు ముందు మరింత బలపడే అవకాశం ఉందని తెలుసుకుని కార్యకర్తలను, నేతలను భయపెట్టే పనిలో ఉన్నారని అలా చేస్తే టీఆర్ఎస్ పార్టీ తీవ్ర పరిణామలు ఎదురుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే పరిషత్ ఎన్నికల్లో గెలిచాక తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ పశ్చిమబెంగాల్ మాదిరిగా మార్చేస్తున్నారని రాజాసింగ్ విమర్శించారు. పరిషత్ ఎన్నికలలో మహబూబ్‌నగర్‌లో ఎక్కువ స్థానలు బేజేపీ గెలిచిందని బీజేపీ కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీనీ నిర్వహిస్తే టీఆర్ఎస్ గూండాలు బేజేపీ కార్యకర్తలపై దాడి చేసారని ఈ దాడిలో ప్రేమ్ కుమార్(23) అనే బీజేపీ కార్యకర్తను దారుణంగా హత్య చేశారని ట్విట్టర్ లో ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ గుండాల దాడిలో చనిపోయిన ప్రేమ్ కుమార్ కుటుంబానికి బీజేపీ మద్ధతుగా నిలుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.