‘ఆర్టికల్ 15’ మూవీ పై రచ్చ

SMTV Desk 2019-06-06 15:48:15  Article 15 movie

దళితులపై దాడులను ఇతివృత్తంగా తీసుకుని రూపొందించిన బాలీవుడ్ సినిమా ‘ఆర్టికల్ 15’పై ఊహించినట్లుగానే వివాదాలు మొదలయ్యాయి. ఈ చిత్రాన్ని అడ్డుకుంటామని ఉత్తరాదిలోని బ్రాహ్మణ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. దళితులపై తాము దాడి చేసినట్లు ఇందులో చూపారని ఆరోపిస్తున్నాయి. నేరానికి పాల్పడిన వ్యక్తిని ‘మహంత్‌జీ కొడుకు’ అని ట్రైలర్‌లో చూపించారని అంటున్నాయి. యూపీలోని బాదాయూలో దళితులపై జరిగిన అత్యాచారాలతో బ్రాహ్మణులకు ఎలాంటి సంబంధమూ లేదని, కేవలం తమ కులాన్ని దూషించడానికే ఇలా చూపారని పరశురామ్ సేన, ఇతర బ్రాహ్మణ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. ఈ చిత్రం విడుదల కాకుండా అడ్డుకుంటామని పరశురామ్ సేన నాయకుడు కుశాల్ తివారీ హెచ్చరించాడు.

బాదాయూలో జరిగిన అక్కచెల్లెళ్లపై అత్యాచారం, దళితులపై అణచివేత వంటివి ఈ చిత్రంలో చూపినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఈ నెల 28న విడుదల కాలనున్న ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా దళితులపై దాడుల కేసులను దర్యాప్తు చేసే పోలీసు అధికారిగా నటించాడు. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించారు.