కిరాణకొట్టుల్లో ఏటీఎంలు?

SMTV Desk 2019-06-06 15:37:26  atms in retail shops rbi new rules

ఏటీఎంల సమస్యల వల్ల ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన నందన్ నిలేకని సారథ్యంలోని ఉన్నత స్థాయి కమిటీ సరికొత్త ఆలోచనతో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో నందన్ నిలేకని ప్యానెల్ పాక్షిక పట్టణ ప్రాంతాల్లోని స్థానిక రిటైల్ స్టోర్స్, ఇతర షాపులను క్యాష్ పాయింట్లుగా ఉపయోగించుకోవాలని ఆర్‌బీఐకి తెలియజేసింది. ఒకవేళ ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే.. ఏటీఎంల స్థానాన్ని కిరాణా షాపులు భర్తీ చేస్తాయని బ్యాంకింగ్ పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కొత్త విధానానికి క్యాష్ ఇన్ క్యాష్ ఔట్ (సీఐసీవో) అనే పేరు పెట్టారు. ఇక్కడ కస్టమర్లు రిటైల్ స్టోర్లకు వెళ్లి వారి డిజిటల్ మనీని నగదుగా మార్చుకోవచ్చు. ఇందుకోసం క్యూఆర్ కోడ్, ఆధార్ ఆధారిత పేమెంట్ వ్యవస్థను ఉపయోగించుకోవచ్చు. ఇకపోతే గత ఏడాది కాలంలో49 బ్యాంకుల్లో 30 వరకు వాటి ఏటీఎంల సంఖ్యను తగ్గించుకున్నాయి. దేశీ దిగ్గజ ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఈ బ్యాంక్ కూడా ఏటీఎంల సంఖ్యను తగ్గించుకుంటూ వస్తోంది.