ఎపి కొత్త మంత్రివర్గం ఈనెల 8న

SMTV Desk 2019-06-06 14:35:00  ap cabinet, jagan,

అమరావతి : ఎపి కొత్త మంత్రివర్గం ఈనెల 8న ప్రమాణ స్వీకారం చేయనుంది. మంత్రి వర్గ విస్తరణపై సిఎం జగన్ కసరత్తు పూర్తి చేశారు. మంత్రి పదవులు పొందే వారి జాబితాను ఆయన తయారు చేసినట్టు తెలుస్తోంది. సామాజిక వర్గాల వారీగా, ఎవరికీ అన్యాయం జరుగకుండా మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని వైసిపి వర్గాలు తెలిపారు. జగన్ కేబినెట్ లో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఏడుగురికి అవకాశం కలిపిస్తున్నారని తెలుస్తోంది. బిసి సామాజిక వర్గం నుంచి ఆరుగురికి, కాపు, కమ్మ, ఎస్సీ మాల వర్గాల నుంచి ఇద్దరేసి చొప్పున, ఎస్సీ మాదిగ, ఎస్టీ, క్షత్రియ, ముస్లిం, మైనారిటీ, బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరి చొప్పున మంత్రులుగా నియమించేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మొత్తం 25 మందితో జగన్ తన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయబోతున్నారని వైసిపి శ్రేణులు తెలిపాయి.