గుజరాత్‌లో స్వల్ప భూకంపం

SMTV Desk 2019-06-06 14:34:24  earth quake,

గుజరాత్‌లో స్వల్ప భూకంపం వచ్చింది. బుధవారం అర్థరాత్రి గుజరాత్ తూర్పు భాగంలో ప్రకంపనలు నమోదయ్యాయి. బనస్‌కాంతతో పాటు దాని పరిసర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.3గా నమోదైంది. పలన్‌పూర్‌కు ఈశాన్యంగా 31 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు గాంధీనగర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిస్మాలాజికల్ రీసెర్చ్ అధికారులు ప్రకటించారు.భూ ప్రకంపనల కారణంగా సబర్‌కాంతవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే స్వల్ప భూకంపం కావడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.అహ్మదాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు మెహ్‌సానా జిల్లా, రాజస్థాన్‌లోని మౌంట్ అబూలో స్వల్ప భూ ప్రకంపనలు నమోదైనట్లు అధికారులు చెప్పారు.