తొలి విదేశి సమావేశానికి నిర్మలా సీతారామన్

SMTV Desk 2019-06-06 14:20:41  nirmala sitaraman, finance minister of india

న్యూఢిల్లీ: తాజగా దేశ ఆర్థికమంత్రిగా భాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్ జూన్ 8న జపాన్‌లో ప్రారంభం కానున్న జి-20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశానికి హాజరు కానున్నారు. అయితే ఆమె ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది తొలి విదేశీ పర్యటన కావడం విశేషం. జపాన్‌లోని ఫకువొకా నగరంలో ఈ సదస్సు జరగనుంది. సీతారామన్‌తో పాటు ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా ఈ సదస్సుకు వెళతారు. ఈ సమావేశంలో మౌలిక రంగంలో పెట్టుబడులు, అంతర్జాతీయ పన్ను విధానాలు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, ముప్పుపై చర్చించనున్నారు. అలాగే కొన్ని దేశాలు వారి వాణిజ్య విధానాల్లో అవలంబిస్తున్న రక్షణాత్మక ధోరణి-, అంతర్జాతీయ వ్యాపారంపై దాని ప్రభావంపై కూడా చర్చించనున్నారు. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి రేటును ఐఎమ్‌ఎఫ్ 3.6 నుంచి 3.3 శాతానికి తగ్గించిన వేళ ఈ సదస్సుకు ప్రాధా న్యం సంతరించుకుంది.