భారీ రేట్ కి ఆర్.ఆర్.ఆర్ ఓవెర్సిస్ డీల్స్

SMTV Desk 2019-06-06 14:19:57  rrr, saaho,

రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికి రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. మూడవ షెడ్యూల్ ఆల్రెడీ షూటింగ్ జరుపుకుంటుంది. 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో కొమరం భీం, అల్లూరి సీతరామరాజు పాత్రల్లో తారక్, చరణ్ నటిస్తున్నారు. సెట్స్ మీద ఉండగానే ఈ సినిమా బిజినెస్ హంగామా మొదలైంది.

ఓవర్సీస్ లో ఈ సినిమా కోసం 60 కోట్ల దాకా డీల్ వచ్చిందట. అయితే ప్రభాస్ సాహో 66 కోట్ల ఓవర్సీస్ రైట్స్ తో దుబాయ్ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ కు 70 కోట్ల దాకా డిమాండ్ చేస్తున్నాడు దానయ్య. ఎన్.టి.ఆర్, రాం చరణ్, రాజమౌళి ఈ ముగ్గురు కాంబినేషన్ కచ్చితంగా మ్యాజిక్ చేస్తుందని నమ్ముతున్నారు ఆడియెన్స్. అలియా భట్ ఒక హీరోయిన్ గా సెలెక్ట్ అయిన ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తుందని తెలుస్తుంది. 2020 సమ్మర్ టార్గెట్ తో ఆర్.ఆర్.ఆర్ వస్తుంది.