గుజరాత్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం

SMTV Desk 2019-06-06 13:04:13  gujarat accident,

గుజరాత్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున నవ్సారి నేషనల్‌ హైవే పై వేగంగా దూసుకువచ్చిన కారు ఓ ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు యవకులు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నిన్న సెలవు కావడంతో ఫ్రెండ్స్‌ తో సరదాగా గడిపి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు..డెడ్‌ బాడీలను పోస్ట్‌ మార్టం నిమిత్తం స్థానిక హాస్పిటల్‌ కు తరలించారు.