కాక మీద కాకినాడ ఎన్నికలు..

SMTV Desk 2017-08-29 16:23:06  KAKINADA ELECTIONS, POLING, 196 POLING CENTERS, RAIN FALL, nota

కాకినాడ ఆగస్ట్ 29 : కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. ఉదయం నుండి వర్షం కారణ౦గా వెలవెలబోయిన పోలింగ్ కేంద్రాలు మధ్యాహ్నం నుండి కళకళలాడుతూ కనిపించాయి. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలలో మొత్తం 48 వార్డులకు గాను 196 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. కేంద్రాల వద్ద ఓటర్లు భారీగా బారులు తీరారు. ఈ కార్పొరేషన్ ఎన్నికలలో నోటా ప్రవేశపెట్టలేదని కొన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరం తెలిపినట్టు సమాచారం. దీనికి గాను బ్యాలెట్ పత్రంపై నోటా ఆప్షన్ అనేది అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకే పరిమితమని, ఏపీ ఎన్నికల సంఘం నిర్దారించింది.