కె.జి.ఎఫ్ డైరక్టర్ తో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్..!

SMTV Desk 2019-06-06 13:02:52  NTR, KGF director,

కన్నడ పరిశ్రమలోనే కాదు సౌత్ ఇండస్ట్రీతో పాటుగా బాలీవుడ్ ను షేక్ చేసిన సినిమా కె.జి.ఎఫ్. ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా యశ్ హీరోగా సూపర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అసలు తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం పరిచయం లేని యశ్ ఇక్కడ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇదిలాఉంటే ప్రస్తుతం కె.జి.ఎఫ్ 2 సెట్స్ మీద ఉంది. చాప్టర్ 1 కన్నా చాప్టర్ 2ని మరింత భారీగా తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ఓ తెలుగు సినిమా చేస్తాడని గట్టిగా ప్రచారం జరుగుతుంది.

మైత్రి మూవీ మేకర్స్ తో ప్రశాంత్ నీల్ సినిమా ఓకే అయ్యిందని.. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా ఈ సినిమా ఉంటుందని టాక్. అయితే ఇదవరకు ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సినిమా అంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు తారక్ తో ప్రశాంత్ నీల్ సినిమా కూడా అలాంటి రూమరేనా లేక నిజంగానే మైత్రి మేకర్స్ ఈ కాంబినేషన్ సెట్ చేశారా అన్నది తెలియాల్సి ఉంది. కె.జి.ఎఫ్ చాప్టర్ 2 కూడా హిట్టైతే ప్రశాంత్ నీల్ కోసం నిర్మాతలు క్యూ కట్టక తప్పదు.