ముఖం మీద మచ్చలు పోవాలంటే ఇలా చేయండి

SMTV Desk 2019-06-06 12:27:41  black dots on face,

అందానికి చర్మకాంతి తోడైతే… ఆ అందం నలుగురిలో ప్రత్యేకంగా నిలుస్తుంది. ముఖం మీద మచ్చలు, మొటిమలు లేకపోయినా కొందరి చర్మం రఫ్‌గా, కాంతిహీనంగా కనిపిస్తుంది. ఎన్ని క్రీములు వాడినా ఆ మెరుపు తాత్కాలికంగా నిలుస్తుంది. అలాంటి వారు ఈ చిట్కాని పాటిస్తే కాంతివంతమైన చర్మం మీ సొంతమవుతుంది. మరింకెందుకు ఆలస్యం ఇలా ప్రయత్నించండి.

కావలిసినవి: శనగపిండి రెండు టీ స్పూన్లు, గంధపుపొడి 1 టీ స్పూన్, పసుపు అరటీస్పూన్, కర్పూరం చిటికెడు, పాలు/ రోజ్‌వాటర్ కొద్దిగా.

తయారీ: ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో శనగపిండి, గంధపుపొడి, పసుపు, కర్పూరం వేసుకోవాలి. ఇప్పుడు మిశ్రమంలో పాలు లేదా రోజ్‌వాటర్ బాగా కలుపుకోవాలి. చల్లని నీటితో ముఖం శుభ్రం చేసుకుని, ఆవిరి పట్టించుకోవాలి. తరువాత ఆ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకుని 20నిమిషాల పాటు బాగా ఆరనివ్వాలి. ఇప్పుడు గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా వారానికి రెండు మూడు సార్లు అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.