వచ్చే ఏడాది మహీంద్రా భారత్‌ స్టేజ్‌-6 వాహనాలు

SMTV Desk 2019-06-06 12:24:30  mahindra and mahindra stage-6 vehicles

ముంబయి: మహింద్రా అండ్‌ మహీంద్రా భారత్‌ స్టేజ్‌-6 నిబంధనలకు అనుగుణంగా వాహనాల మోడల్స్‌ను వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలోగా మార్కెట్లోకి ప్రవేశపెడతామని ఆ సంస్థ ఎండీ పవన్‌ గోయంకా తెలిపారు. అయితే ఆ కొత్త నిబంధలు డీజిల్‌ వాహనాలను మరింత ప్రియం చేయనున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. 2020 ఏప్రిల్‌ 1 నాటికి పెట్రోల్‌, డీజిల్‌ రకాల వాహనాలు సిద్ధమైపోతాయని తెలిపారు. నాలుగు మీటర్లకు మించి పొడవు ఉన్న వాహనాలపై 50శాతం వరకు జీఎస్‌టీ పెరగవచ్చని.. ఈ పెంపు రూ.లక్షల వరకు ఉంటుందని గోయంకా తెలిపారు. చిన్న డీజిల్‌ వాహనాలపై రూ.80,000 వేల వరకు పెరుగుదల ఉంటుందని పేర్కొన్నారు. ఇక పెట్రోల్‌ మోడల్స్‌పై రూ20 వేల నుంచి రూ.25 వేల వరకు పెరుగుదల ఉండవచ్చన్నారు.