బిజీ బిజీ గా రోజా

SMTV Desk 2019-06-06 12:05:33  Roja, YSRCP,

ఏపీలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నగరి నుంచి రెండోసారి ఘన విజయం సాధించారు ఎమ్మెల్యే రోజా. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రోజా హైదరాబాద్‌లో చాలా బిజీగా గడుపుతున్నారు. తాజాగా మణికొండలోని పార్వతీసమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో రోజా మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలోని పూజారుల సమక్షంలో రోజా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేకంగా అభిషేకం.. గోమాతకు పూజలు నిర్వహించారు.

కాగా హైదరాబాద్ లోని మణికొండ పంచవటి కాలనీలో రోజా నివాసం ఉంటారు. దాంతో అప్పుడప్పుడు ఆ దేవాలయానికి వచ్చి పూజలు నిర్వహిస్తుంటారు. ఎన్నికలకు ముందు కూడా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత నగరిలో మళ్లీ ఎమ్మెల్యేగా విజయం అందుకోవడంతో తిరిగి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.