బ్రేకింగ్: ఇంటర్‌ ప్రశ్నాపత్రాలు గల్లంతు

SMTV Desk 2019-06-05 16:34:19  inter supplementary

తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో జరిగిన అవకతవకలు మరువకముందే ఇంటర్ బోర్డు మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ప్రశ్నా పత్రాలను భద్రపరచడంలో ఇంటర్ బోర్డు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. వరంగల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఉంచిన ఇంటర్‌ ప్రశ్నాపత్రాలు గల్లంతయ్యాయి.

ఈనెల 7 నుండి ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో.. వరంగల్‌ పోలీస్‌ స్టేషన్‌లో భద్రపరిచిన 2 ప్రశ్నాపత్రాల సీల్‌ బాక్సులు కనిపించకుండా పోయాయి. దీంతో 2 రోజులుగా ప్రశ్నాపత్రాల కోసం అధికారులు రహస్యంగా వెదుకుతున్నారు. ఈనెల 9, 10 తేదీలలో జరిగే పరీక్షల ప్రశ్న పత్రాలు అదృశ్యమైనట్టు తెలుస్తోంది.