పవన్ కళ్యణ్ కు అస్వస్థత

SMTV Desk 2019-06-05 16:29:11  Pawan kalyan,

ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఫలితాలపై సమీక్షించుకునేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు మంగళగిరి, విజయవాడలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటనకు తాత్కాలిక బ్రేక్ పడింది. పవన్ కల్యాణ్ ఈరోజు అనారోగ్యానికి గురి కావడంతో ఆయన విజయవాడ, మంగళగిరి పర్యటనను వాయిదా వేసుకున్నారు. మళ్లీ పవన్ పర్యటన ఎప్పుడు ఉంటుందో త్వరలోనేే ప్రకటిస్తామని జనసేన వర్గాలు తెలిపాయి.