పెళ్లి కంటే సహజీవనమే ఉత్తమమైనది

SMTV Desk 2019-06-05 16:26:00  Salman khan,

ముంబయి : తనకు పెళ్లిపై నమ్మకం లేదని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ తేల్చిచెప్పారు. సల్మాన్ నటించిన ‘భారత్’ బుధవారం విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా సల్మాన్ ఖాన్ మాట్లాడారు. ఇటీవలి కాలంలో చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు పెళ్లి చేసుకున్నారు. 53 ఏళ్లు వచ్చినా సల్మాన్ మాత్రం పెళ్లి చేసుకోలేదు. ఈ క్రమంలోనే ఆయన తన పెళ్లి పై స్సందించారు. పెళ్లిళ్లపై తనకు అస్సలు నమ్మకమే లేదని ఆయన పేర్కొన్నారు. పెళ్లి అనేది ఓ మరణిస్తున్న సంస్థ లాంటిదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. పెళ్లి కంటే సహజీవనమే ఉత్తమమైనదని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సరోగసి ద్వారా ఆయన పిల్లలను కనేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. తాను నాన్నగా పిలిపించుకోవాలని ఆయన కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సరోగసి ద్వారా పిల్లలను కనాలని ఆయన ఆశిస్తున్నట్టు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. గతంలో సల్మాన్ చాలా మంది హీరోయిన్లతో ప్రేమలో పడడం, ఆ ప్రేమలు బ్రేకప్ కావడం జరిగిన విషయం తెలిసిందే.