బాత్రూం టైల్స్ పై గాంధీ ఫోటోలు

SMTV Desk 2019-06-05 16:08:27  mahatma gandhi, batrrom toilets,

లక్నో: మహాత్మా గాంధీ, అశోక చక్ర చిత్రాలున్న టైల్స్‌తో మరుగుదొడ్లు కట్టిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహార్‌లో చోటు చేసుకుంది. స్వచ్ఛ భారత అభియాన్ పథకం కింద నిర్మించిన ఈ మరుగుదొడ్లపై గ్రామస్తులు మండిపడ్డారు. దీంతో ఓ అధికారిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. దీబాయ్ తహశీల్‌‌లోని ఇచ్చవరి గ్రామంలో స్వచ్ఛ భారత్ అభియాన్ కింద దాదాపు 508 మరుగుదొడ్లు కట్టారు. వీటిలో 13 బాత్రూంలలో మహాత్మా గాంధీ, అశోక చక్ర చిత్రాలున్న టైల్స్ వాడారు. దీనికి బాధ్యుడైన ఓ అధికారిపై సస్పెంన్షన్ వేటు పడింది. అంతే కాకుండా గ్రామ సర్పంచ్ పైనా కూడా చర్యలు తీసుకున్నామని జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి అమర్జీత్ సింగ్ తెలిపారు. అయితే, వారం రోజుల క్రితమే మరుగుదొడ్లపై ఈ టైల్స్ అతికించినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటనతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.