కాస్టింగ్ కౌచ్: విజయ్ డైరెక్టర్ నన్ను ఆ పని చేయమన్నాడు ...

SMTV Desk 2019-06-05 15:51:57  shammu, actress,

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ ఏ వుడ్ తీసుకున్నా ఏమున్నది చండాలం అన్ని చోట్లా క్యాస్టింగ్ కోచ్ చోద్యం అన్నట్టు సాగుతోంది వ్యవహారం. కాకపోతే శ్రీ రెడ్డి లాంటి కడుపు మండిన వారు బయటకు వచ్చి రచ్చ చేస్తున్నా ఎంతో మంది తమ తమ కెరీర్ ల కోసం పెదవి చాటున వాటిని భరిస్తూనే ఉన్నారు. పేరున్న హీరోతో నటించాలన్నా, అసలు నటించాలన్నా అయితే పడకసుఖం ఇవ్వాల్సిందే అని మృగాళ్లు తమ కామవాంఛల్ని తీర్చుకోవడం కోసం ఆఫర్స్‌ని ఎరగా వేస్తున్నారు.

తాజాగా తమిళ వర్దమాన నటి షమ్ము తనకు ఎదురైన లైంగిక వేధింపుల్ని బట్టబయలు చేస్తోంది. తాజాగా ఆమె శివ కార్తికేయన్ తో ఒక సినిమా చేయగా అది రిలేజ్ అవడానికి సిద్దమయింది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆమె అభిమానులతో చాట్ చేసింది. ఈ నేపధ్యంలో మిమ్మల్ని ఎవరయినా లైంగికంగా వేధించారా అని అడగగా. విజయ్ దేవరకొండ సినిమాలో ఆఫర్ ఇస్తానని ఓ ప్రముఖ దర్శకుడు తనను లైంగికంగా వేధింపులకు గురిచేశాడని చెప్పుకొచ్చింది షమ్ము. ఆ సినిమాలో నటించాలంటే తన కోరిక తీర్చాలని షరతు పెట్టాడని అయితే దీనిపై తాను ఎవరికీ ఫిర్యాదు చేయలేదన్నారు. ఎందుకంటే ఇలాంటి వాటిని ఎలా ఎదుర్కోవాలో తనకు బాగా తెలుసనీ, ఫిర్యాదు చేసినా లాభం ఉండదని కూడా తెలుసని ఆరోపణలు చేసింది షమ్ము. అయితే ఆ దర్శకుడు ఎవరన్నది మాత్రం ఆమె చెప్పలేదు.