పాక్ కి కంగ్రాట్స్: సానియా

SMTV Desk 2019-06-05 15:35:08  sania mirza congrats pakistan, icc worlcd cup 2019

ఇస్లామాబాద్: ప్రపంచకప్ 2019లో సోమవారం రాత్రి ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్ లో అసాధారణ రీతిలో పోరాడిన పాక్ జట్ట 14 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. అంతముందు మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన పాకిస్థాన్ గెలుపు రుచి చూసిన ఆ జట్టుని పాక్ అభిమానులు ప్రశంసలతో ముంచెత్తారు. అనిశ్చితికి మారుపేరైన పాక్.. మరోసారి ఎవరి అంచనాలకి అందదని నిరూపించింది. పాక్ విజయంపై స్పందించిన సానియా మీర్జా.. ఆ జట్టుకి అభినందనలు తెలుపుతూ టోర్నీలో పుంజుకున్న తీరుతో మరోసారి అంచనాలకి అందని జట్టుగా నిలిచినట్లు తెలిపింది. అంతేకాకుండా.. ఇకపై ప్రపంచకప్‌ మరింత ఆసక్తికరంగా ఉండబోతోందంటూ పరోక్షంగా భారత్‌, పాకిస్థాన్ మ్యాచ్‌ని ప్రస్తావించింది. జూన్ 16న భారత్, పాక్ జట్లు తలపడనున్నాయి.