సెవెన్ సినిమాకి గట్టి షాక్

SMTV Desk 2019-06-05 15:33:34  seven movie,

విభిన్నమైన కథాంశంతో విడుదలకు సిద్ధమవుతున్న సెవెన్ సినిమాకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమాను విడుదల చేయకూడదంటూ హైదరాబాద్ సివిల్ కోర్టు స్టే ఇచ్చింది. డైరెక్టర్ రమేష్ వర్మ నిర్మాతగా రూపొందించిన ఈ సినిమాలో హవీష్, రెజీనా, నందితా శ్వేత, పూజిత పొన్నాడ తదితరులు నటించారు. సినిమాటోగ్రాఫర్ నిజర్ షఫీ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాని రేపు విడుదల చేయాలని నిర్మాత ప్లాన్ చేయగా ఎన్నారై కిరణ్ తలశిల దాఖలు చేసిన పిటిషన్ మేరకు ఈ రిలీజ్‌పై కోర్టు స్టే విధించింది. సెవెన్ సినిమా మొదలుపెట్టే ముందు ఈ సినిమాలో తనకి కూడా వాటా ఇచ్చేలా రమేష్ వర్మతో ఒప్పందం చేసుకున్నానని అందుకు నిర్మాణ ఖర్చుల కోసం భారీ మొత్తాన్ని నా నుంచి తీసుకుని సినిమా రెడీ అయ్యాక ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఫోన్ చేస్తే కాల్ ఎత్తడం మానేశాడని, సంప్రదించడానికి ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదనీ చర్చలు జరపడానికి ప్రయత్నించినా ఫలితం కనిపించకపోవడంతో తెలుగు ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేశాననీ దాని వల్ల కూడా సమస్య పరిష్కారం కాకపోవదంతో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించడంతో సెవెన్ సినిమాను ఎక్కడ కూడా విడుదల చేయవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసిందని కిరణ్ తెలిపారు.