విండీస్ బ్యాట్స్‌మన్‌లకు కౌల్టర్‌నైల్ హెచ్చరికలు

SMTV Desk 2019-06-05 15:31:47  Nathan Coulter-Nile

ఆస్ట్రేలియా పేసర్ కౌల్టర్‌నైల్ వెస్టిండీస్‌ బ్యాట్స్‌మన్‌లకు హెచ్చరికలు చేశాడు. ప్రపంచకప్ టోర్నీలో భాగంగా జూన్ 6 న ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్ మధ్య మ్యాచ్ జరగనుంది. విండీస్ తన తొలి మ్యాచులో పాక్‌ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా విండీస్ ఫాస్ట్ బౌలర్లు ఓషానో థామస్, కాట్రెల్, హోల్డర్, రస్సెల్ షార్ట్‌పిచ్ బంతులతో పాక్ బ్యాట్స్‌మెన్‌ను వరుసగా పెవిలియన్ పంపారు. ఈ నేపథ్యంలో తాము కూడా షార్ట్‌పిచ్ బంతులతో విండీస్ పని పడుతామని కౌల్టర్‌నైల్ హెచ్చరించాడు. పాక్‌పై విండీస్ బౌలర్లు షార్ట్‌పిచ్ బంతులతో విరుచుకుపడ్డారు. మేము కూడా షార్ట్‌పిచ్ బంతులనే ఉపయోగిస్తాం. వెస్టిండీస్‌ను కట్టడి చేస్తాం. భారీ హిట్టర్లు ఉన్న విండీస్ ఎప్పుడైనా ప్రమాదకరమే. ఓవర్‌కు రెండు బౌన్సర్ల అవకాశాన్ని మేమూ వినియోగించునుకుంటాం. మైదానాలు చాలా చిన్నవిగా ఉండటం, వికెట్ కూడా ఫ్లాట్‌గా ఉంది. దీంతో బౌన్సర్ల అస్త్రం పనికొస్తుంది. గేల్ లాంటి విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ను పరుగులు చేయకుండా ఆపాలంటే ఒత్తిడి పెంచాలి అని కౌల్టర్‌నైల్ పేర్కొన్నాడు.