తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభంజనం

SMTV Desk 2019-06-05 15:17:04  TRS party,

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. ఎన్నికలేవైనా గెలుపు గులాబీ పార్టీదే నని మరోసారి రుజువైంది. అసెంబ్లీ, పార్లమెంటు, ఎమ్మెల్సీ, పంచాయతీ ఎన్నికల్లోలాగే ఎంపీటీసీ ఫలితాల్లోనూ కారు జెట్ స్పీడ్ తో దూసుకెళ్లింది. కారు స్పీడును తట్టుకోలేక ఇతర పార్టీలు బేజారయ్యాయి. టీఆర్ఎస్ జోరు ముందు కాంగ్రెస్, బీజేపీల అడ్రస్ గల్లంతయ్యింది. ప్రతి జిల్లాలోనూ గులాబీ పార్టీ సత్తా చాటింది. మెజార్టీ స్థానాలను గెలుచుకొని తెలంగాణ గడ్డపై తనకు ఎదురులేదని మరోసారి చాటిచెప్పింది. మొత్తం 5 వేల 816 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అందులో టీఆర్ఎస్ అభ్యర్థులు 3,571 స్థానాల్లో విజయఢంకా మోగించగా… కాంగ్రెస్ – 1,387.. బీజేపీ – 206, ఇతరులు – 652 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు.

ఆదిలాబాద్ జిల్లాలో కారు జెట్ స్పీడ్ తో దూసుకెళ్లింది. మొత్తం 158 ఎంపీటీసీ స్థానాలకు గాను 83 స్థానాల్లో టీఆర్ఎస్ విజయదుందుభి మోగించింది. కాంగ్రెస్ 28, బీజేపీ 33 స్థానాలకు పరిమితమయ్యాయి. ఇతరులు 14 స్థానాల్లో విజయం సాధించారు.

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గులాబీ హవా కొనసాగింది. మొత్తం 123 స్థానాలకు గాను 81 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. కాంగ్రెస్ 21, బీజేపీ 3 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఇతరులు 18 స్థానాల్లో విజయం సాధించారు.

మంచిర్యాల జిల్లాలో టీఆర్ఎస్ సత్తా చాటింది. మొత్తం 130 స్థానాలకు గాను 78 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ 36 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది. ఇతరులు 16 స్థానాల్లో గెలుపొందారు.

నిర్మల్ జిల్లాలో కారు దుమ్మురేపింది. మొత్తం 156 స్థానాలకు గాను 84 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ 52, బీజేపీ అభ్యర్థులు 6 స్థానాలకు పరిమితం అయ్యారు. ఇతరులు 14 స్థానాల్లో గెలుపొందారు.

నిజామాబాద్ జిల్లాలో గులాబీజెండా సగర్వంగా రెపరెపలాడింది. మొత్తం 299 స్థానాలకు గాను 203 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ 39, బీజేపీ 32 స్థానాలకు పరిమితం అయ్యాయి. ఇతరులు 25 స్థానాల్లో గెలుపొందారు.

జగిత్యాల జిల్లా టీఆర్ఎస్ వెన్నంటి నిలిచింది. మొత్తం 214 స్థానాలకు గాను 143 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ 37, బీజేపీ 19 స్థానాలకు పరిమితం అయ్యాయి. ఇతరులు 15 స్థానాల్లో గెలుపొందారు.

పెద్దపల్లి జిల్లాలో టీఆర్ఎస్ సత్తా చాటింది. మొత్తం 138 స్థానాలకు గాను 89 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ 33, బీజేపీ 6 స్థానాలకు పరిమితం అయ్యాయి. ఇతరులు 10 స్థానాల్లో గెలుపొందారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గులాబీ పార్టీ విజయదుందుభి మోగించింది. మొత్తం 106 స్థానాలకు గాను టీఆర్ఎస్ అభ్యర్థులు 64 స్థానాల్లో ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ 25, బీజేపీ 2 స్థానాలకు పరిమితం అయ్యాయి. ఇతరులు 15 స్థానాల్లో గెలుపొందారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీఆర్ఎస్ విజయయాత్ర కొనసాగింది. మొత్తం 209 స్థానాలకు గాను 118 స్థానాల్లో గులాబీ అభ్యర్థులు సత్తా చాటారు. కాంగ్రెస్ 26 స్థానాలకు పరిమితమైంది. ఇతరులు 65 స్థానాల్లో గెలుపొందారు.

మహబూబాబాద్ జిల్లాలో వార్ వన్ సైడ్ అయ్యింది. మొత్తం 198 స్థానాలకు గాను 129 స్థానాల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ 52, బీజేపీ ఒక స్థానానికి పరిమితం అయింది. ఇతరులు 16 స్థానాల్లో గెలుపొందారు.

వరంగల్ రూరల్ జిల్లాలో టీఆర్ఎస్ ఏకపక్ష విజయాన్ని సాధించింది. మొత్తం 178 స్థానాలకు గాను 129 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ 43 స్థానాల్లో, ఇతరులు 6 స్థానాలకు పరిమితం అయ్యారు.

వరంగల్ అర్బన్ జిల్లా మొత్తం గులాబీ జెండాకే మద్దతు పలికింది. మొత్తం 86 స్థానాలకు గాను 62 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ 12, బీజేపీ ఒక స్థానానికి పరిమితం అయ్యాయి. ఇతరులు 11 స్థానాల్లో గెలుపొందారు.

కరీంనగర్ జిల్లాలో గులాబీజెండానే ఎగిరింది. మొత్తం 178 స్థానాలకు 98 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ 26, బీజేపీ 15 స్థానాలకు పరిమితం అయింది. ఇతరులు 39 స్థానాల్లో గెలుపొందారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తనకు ఎదురులేదని మరోసారి టీఆర్ఎస్ చాటిచెప్పింది. మొత్తం 123 స్థానాలకుగాను టీఆర్ఎస్ అభ్యర్థులు 72 స్థానాల్లో ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ 18, బీజేపీ 7 స్థానాలకు పరిమితం అయ్యాయి. ఇతరులు 26 స్థానాల్లో గెలుపొందారు.

కామారెడ్డి గడ్డపై టీఆర్ఎస్ విజయఢంకా మోగించింది. మొత్తం 236 స్థానాలకు గాను 149 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ 61, బీజేపీ 4 స్థానాలకు పరిమితం అయ్యాయి. ఇతరులు 22 స్థానాల్లో గెలుపొందారు.

సంగారెడ్డి జిల్లాలో కారు ఫుల్ స్పీడ్ తో దూసుకుపోయింది. మొత్తం 295 స్థానాలకు గాను 177 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్తులు ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ 102, బీజేపీ 2 స్థానాలకు పరిమితం అయ్యాయి. ఇతరులు 14 స్థానాల్లో గెలుపొందారు.

మెతుకుసీమ మెదక్ లో గులాబీ పార్టీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 189 స్థానాలకు గాను 118 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ 44 స్థానాలకు పరిమితమైంది. ఇతరులు 27 స్థానాల్లో గెలుపొందారు.

సిద్దిపేట గడ్డపై టీఆర్ఎస్ మరోసారి విజయభేరి మోగించింది. మొత్తం 229 స్థానాలకు గాను 153 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ 29, బీజేపీ 3 స్థానాలకు పరిమితం అయ్యాయి. ఇతరులు 44 స్థానాల్లో గెలుపొందారు.

జనగామలో కారు ధాటికి తట్టుకోలేక ఇతర పార్టీలు చేతులెత్తేశాయి. మొత్తం 140 స్థానాలకు గాను 97 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ 32 స్థానాలకు పరిమితం కాగా.. ఇతరులు 11 స్థానాల్లో గెలుపొందారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో టీఆర్ఎస్ విజయనాదం చేసింది. మొత్తం 177 స్థానాలకు గాను టీఆర్ఎస్ అభ్యర్థులు 85 స్థానాల్లో ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ 72, బీజేపీ ఒక స్థానానికి పరిమితం అయ్యాయి. ఇతరులు 19 స్థానాల్లో గెలుపొందారు.

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో టీఆర్ఎస్ ఏకపక్ష విజయాన్ని సాధించింది. మొత్తం 42 స్థానాలకు గాను టీఆర్ఎస్ అభ్యర్థులు 18 స్థానాల్లో ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ 13, బీజేపీ ఒక స్థానానికి పరిమితం అయ్యాయి. ఇతరులు 10 స్థానాల్లో గెలుపొందారు.

రంగారెడ్డి జిల్లాలో కారు రయ్యిమంటూ దూసుకెళ్లింది. మొత్తం 257 స్థానాలకు గాను 128 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయదుందుభి మోగించారు. కాంగ్రెస్ 74, బీజేపీ 18 స్థానాలకు పరిమితం అయ్యాయి. ఇతరులు 37 స్థానాల్లో గెలుపొందారు.

వికారాబాద్ జిల్లాలో వార్ వన్ సైడ్ అయ్యింది. మొత్తం 221 స్థానాలకు గాను టీఆర్ఎస్ అభ్యర్థులు 137 స్థానాల్లో ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ 75, ఇతరులు – 9 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యారు.

మహబూబ్ నగర్ జిల్లా జనమంతా టీఆర్ఎస్ కే జై కొట్టారు. మొత్తం 169 స్థానాలకు గాను 113 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ 40, బీజేపీ 6, ఇతరులు -10 స్థానాలకు పరిమితం అయ్యారు.

జోగులాంబ గద్వాల జిల్లాలో గులాబీజెండా హవానే కొనసాగింది. మొత్తం 141 స్థానాలకు గాను టీఆర్ఎస్ అభ్యర్థులు 99 స్థానాల్లో ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ 17, బీజేపీ 11, ఇతరులు -14 స్థానాలకు పరిమితం అయ్యారు.

వనపర్తి జిల్లా మొత్తం గులాబీ పార్టీ వెన్నంటి నిలిచింది. మొత్తం 128 స్థానాలకు గాను టీఆర్ఎస్ అభ్యర్థులు 89 స్థానాల్లో ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ 20, ఇతరులు 19 స్థానాలకు పరిమితం అయ్యారు.

నాగర్ కర్నూల్ గడ్డపై గులాబీజెండా చరిత్ర సృష్టించింది. మొత్తం 211 స్థానాల్లో గాను టీఆర్ఎస్ టీఆర్ఎస్ అభ్యర్థులు 138 స్థానాల్లో ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ 52, బీజేపీ 4, ఇతరులు 17 స్థానాలకు పరిమితం అయ్యారు.

నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ కే జై కొట్టింది. మొత్తం 349 స్థానాల్లో గాను టీఆర్ఎస్ అభ్యర్థులు 191 స్థానాల్లో ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ 134, బీజేపీ 4, ఇతరులు 20 స్థానాలకు పరిమితం అయ్యారు.

సూర్యాపేట జిల్లాలో గులాబీపార్టీ హవా కొనసాగింది. మొత్తం 235 స్థానాలకు గాను టీఆర్ఎస్ అభ్యర్థులు 144 స్థానాల్లో ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ 75, బీజేపీ 3 స్థానాలకు పరిమితం అయ్యాయి. ఇతరులు 13 స్థానాల్లో గెలుపొందారు.

ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ చరిత్ర సృష్టించింది. మొత్తం 289 స్థానాలకు గాను టీఆర్ఎస్ అభ్యర్థులు 168 స్థానాల్లో ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ 58 స్థానాలకు పరిమితమైంది. ఇతరులు 62 స్థానాల్లో గెలుపొందారు.

ములుగు జిల్లా మొత్తం కారుకు సంపూర్ణ మద్దతు పలికింది. మొత్తం 72 స్థానాలకు గాను 48 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ 23, ఇతరులు ఒక స్థానానికి పరిమితం అయ్యారు.

నారాయణపేట జిల్లాలో టీఆర్ఎస్ హవా కొనసాగింది. మొత్తం 140 స్థానాలకు గాను 85 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ 18, బీజేపీ 25, ఇతరులు 12 స్థానాలకు పరిమితం అయ్యారు.

మొత్తంగా ఎంపీటీసీ ఫలితాల్లో ప్రతి జిల్లాలోనూ గులాబీజెండానే రెపరెపలాడింది. టీఆర్ఎస్ అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో విజయదుందుభి మోగించి సత్తా చాటారు.