సెమీఫైనల్లో బ్రిటన్ స్టార్ జొహానా

SMTV Desk 2019-06-05 15:14:49  french open tournament 2019, johanna konta enters semi finals

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో బ్రిటన్ స్టార్ జొహానా కొంటా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. అమెరికా స్టార్, ఏడో సీడ్ స్లొవానె స్టీఫెన్స్‌తో మంగళవారం జరిగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 61, 64 తేడాతో తనని ఓడించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే రెండో సెట్‌లో స్టీఫెన్స్ కాస్త పుంజుకుంది. కొంటాకు దీటుగా బదులిచ్చింది. అయితే అది తాత్కాలికమే అయ్యింది. కీలక దశలో మళ్లీ ఒత్తిడికి గురి కావడంతో కొంటాకు ఎదురులేకుండా పోయింది. చివరి వరకు దూకుడును ప్రదర్శించిన కొంటా వరుసగా రెండు సెట్లు గెలిచి సెమీస్‌కు చేరుకుంది.