టిటిడి చైర్మన్ గా మంచు మోహన్ బాబు?

SMTV Desk 2019-06-05 15:13:24  Mohan babu, YCP, ttd,

అమరావతి : టిటిడి చైర్మన్ గా ప్రముఖ నటుడు, వైసిపి నేత మంచు మోహన్ బాబును నియమించే అవకాశం కనిపిస్తోంది. టిటిడి చైర్మన్ గా మోహన్ బాబును నియమించనున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ విషయంపై మోహన్ బాబు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. వైసిపి చీఫ్ జగన్ ను ఎపి సిఎంగా చూడాలన్నదే తన కోరిక అని మోహన్ బాబు తేల్చి చెప్పారు. వైసిపి విజయం కోసం తన వంతు ప్రయత్నం చేశానని ఆయన చెప్పుకొచ్చారు. తాను ఎటువంటి నామినేటెడ్ పదవులు ఆశించడం లేదని, జగన్ ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో పని చేస్తానని మోహన్ బాబు స్పష్టం చేశారు. తనను టిటిడి చైర్మన్ గా నియమిస్తున్నారన్న వార్తలపై ఆయన ట్వీట్ చేస్తూ పైవిధంగా స్పందించారు.