ప్రపంచకప్ లో భారత్ వేట షురూ

SMTV Desk 2019-06-05 15:10:22  india, South africa

ఈ ఏడాది వరల్డ్ కప్ కి ఈరోజు నుండి మరింత ఊపు రానుంది ఎందుకంటే వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్ కోసం ఇండియన్ జట్టు సిద్ధమైంది. తొలి మ్యాచ్‌ ఇవాళ సౌతాఫ్రికాతో తలపడనుంది భారత జట్టు. ఇక ఇప్పటికే పేలవంగా ఆడుతున్నన దక్షిణాఫ్రికాకు భారత్‌తో జరగనున్న కీలక మ్యాచ్ ముందు ఎదురు దెబ్బ తగిలింది. భుజం కారణంగా పేసర్ డేల్ స్టెయిన్ వరల్డ్ కప్‌ నుంచి వైదొలిగాడు. భుజం గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమైన స్టెయిన్.. గాయం తగ్గకపోవడంతో.. వరల్డ్ కప్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడలేకపోయాడు.

సౌతాఫ్రికా తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డ్ నెలకొల్పిన స్టెయిన్‌ను మూడేళ్లుగా భుజం గాయం వేధిస్తోంది. 2016లో అతడి భుజానికి శస్త్రచికిత్స జరిగినప్పటికీ.. గాయం పదే పదే తిరగబెడుతోంది. వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన దక్షిణాఫ్రికా.. తర్వాతి మ్యాచ్‌లో అనూహ్యంగా బంగ్లా చేతిలో ఓటమిపాలైంది. మనతో మ్యాచ్‌ నాటికి స్టెయిన్ ఫిట్ అవుతాడని భావించినప్పటికీ.. అతడు ఏకంగా వరల్డ్ కప్‌కి దూరం కావడం సౌతాఫ్రికాకు ఓ రకంగా షాక్ అనే చెప్పొచ్చు. ఇక బలహీనంగా కనిపిస్తున్నా ఆ జట్టును అంత లైట్ తీసుకునే పరిస్థితి లేదు. దీంతో టీమిండియాకి తొలిపోరే ఆసక్తికరంగా సాగనుంది. చూడాలి మరి ఈరోజు ఏమవుతుందో ?