శ్రీలంక-అఫ్టానిస్తాన్‌ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం

SMTV Desk 2019-06-05 14:50:45  rain

ప్రపంచ కప్ మెగా టోర్నీ భాగంగా శ్రీలంక-అఫ్టానిస్తాన్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. అకస్మాత్తుగా వర్షం రావడంతో మ్యాచ్ అంపైర్లు ఆటకు తాత్కాలిక విరామం ప్రకటించారు. ఈ నేపథ్యంలో పిచ్‌ను, ఔట్‌ ఫీల్డ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. వర్షం కారణంగా మ్యాచ్‌ నిలిచే సమయానికి శ్రీలంక 33 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 182పరుగులు చేసి పీకల్లోతులో ఉంది .. క్రీజులో లక్మల్‌(2) మలింగ (0) ఉన్నారు.ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన అఫ్గానిస్తాన్‌​ ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్‌ చేపట్టిన లంక ఇన్నింగ్స్‌ను కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నే- కుశాల్‌ పెరీరాలు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 92 పరుగులు జత చేసి మంచి ఆరంభాన్నిచ్చారు. కాగా, తిరుమన్నే(30) భారీ షాట్‌కు యత్నించి తొలి వికెట్‌గా ఔటయ్యాడు. అఫ్గాన్‌ స్పిన్నర్‌ నబీ బౌలింగ్‌లో నజీబుల్లాకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.ఆపై స్వల్ప సమయాల్లో ప్రధాన వికెట్లను కోల్పోవడంతో లంక కష్టాల్లో పడింది. ది. అఫ్గాన్‌ స్పిన్నర్‌ మహ్మద్‌ నబీ వేసిన 22 ఓవర్‌లో లంకేయులు మూడు వికెట్లను చేజార్చుకున్నారు. ఆ ఓవర్‌ రెండో బంతికి తిరిమన్నే(25)ను ఔట్‌ చేసిన నబీ.. నాల్గో బంతికి కుశాల్‌ మెండిస్‌(2), ఆరో బంతికి ఏంజెలో మాథ్యూస్‌(0)ను పెవిలియన్‌కు చేర్చాడు. ఆపై హమిద్‌ బౌలింగ్‌లో ధనంజయ డిసిల్వా డకౌట్‌ కాగా, తిషారా పెరీరా(2) కూడా నిరాశపరిచాడు. ఇక బాధ్యతాయుతంగా ఆడిన కుశార్‌ పెరీరా(78) ఎనిమిదో వికెట్‌గా ఔటయ్యాడు. అఫ్గాన్‌ బౌలర్లలో మహ్మద్‌ నబీ నాలుగు వికెట్లు సాధించగా, రషీద్‌ ఖాన్‌, దావ్లాత్‌ జద్రాన్‌, హమిద్‌ హసన్‌లు తలో వికెట్‌ తీశారు.