ట్రేండింగ్ లో సూపర్ 30 ట్రైలర్

SMTV Desk 2019-06-05 14:46:39  Super 30 trailer,

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నుంచి ప్రేక్షకులు ఓ క్రిష్.. ఓ ధూమ్2 వంటి సినిమాలు కోరుకుంటారు. కానీ అందుకు విరుద్ధంగా ఓ సినిమాలో నటిస్తున్నాడు హృతిక్. అసలే దర్శకుడి మీటు వివాదం.. కంగనా వివాదంతో సతమతమౌతూ ఉన్న హృతిక్ కి పూర్తిగా బయటపడి మంచి హీరో అనిపించుకొనేందుకు రియల్ స్టోరీతో మంచి మూవీ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఇబ్బంది పడ్డ హృతిక్ కు ఉపశమనం కలిగించేలా ఈరోజు వాళ్ళ కాష్ఠానికి తగిన ప్రతిఫలాన్ని సూపర్ 30 ట్రైలర్ అందించిందనే చెప్పాలి.



కాగా హృతిక్ రోషన్ తన నటనా పరంగా మంచి పెర్ఫార్మన్స్ ప్రదర్శించి చూపాడు. సూపర్బ్ పెర్ఫార్మన్స్... సినిమాపైస భారీ అంచనాలు పెంచే ట్రైలర్ సూపర్ థర్టీ. దండిగా డబ్బును ఇచ్చే కోచింగ్ సెంటర్ లో టీచర్ ఉద్యోగాన్ని విడిచి పెట్టి ఎక్కడో మట్టిలో తిరిగే విద్యార్థుల కోసం ట్యూషన్ సెంటర్ స్టార్ట్ చేసి వాళ్ళను ఎలా తీర్చి దిద్దాడు అన్నదే ఈ స్టోరీ. అయితే టీజర్ లోని రెండు నిమిషాలు చూస్తున్నప్పుడు.. ఎవరికైనా రోమాలు నిక్కబొడుచు కోవాల్సిందే. మొత్తానికి టీజర్ టాక్ ను బట్టి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.