జగన్ ఇఫ్తార్ విందు పై వైసీపీ సోషల్ ఆర్మీ స్పందన

SMTV Desk 2019-06-05 12:28:25  Jagan Iftar

ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం అతి తక్కువ ఖర్చుతో చాలా నిరాడంబరంగా చేశారు. ఆ తర్వాత వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలోనే సమీక్షలు నిర్వహిస్తూ.. స్వయంగా అధికారులకు నివాసంలోని భోజన వసతులు ఏర్పాటు చేస్తున్నారు. చాలా చకచకా సమీక్షలు నిర్వహిస్తూ అధికారుల్లో కూడా హుషారును తెప్పిస్తున్నారు. చురుకుగా సూటిగా మాట్లాడాలంటూ అధికారుల వద్ద నుంచి పలు ప్రశ్నలకు సమాధానాలను వేగంగా రాబట్టుకుంటున్నారు.

అయితే జగన్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచీ రాష్ట్ర.. జాతీయ మీడియా జగన్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యనాలు చేస్తుంది. వైఎస్ జగన్ చాలా నిరాడంబరంగా తక్కువ ఖర్చుతో కేవలం రూ. 29 లక్షల్లోనే ప్రమాణ స్వీకారం చేశారని..గతంలో చేసిన వారికంటే పూర్తి విరుద్ధంగా.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని ఏపీలో ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది గాడిలో పెట్టేందుకు జగన్ అడుగులు వేస్తున్నారని కొనియాడుతున్నాయి. కానీ.. అంత తక్కువ ఖర్చుతో ప్రమాణ స్వీకారం చేసిన ఏపీ ప్రభుత్వం.. ముస్లింలకిచ్చే ఇఫ్తార్ విందుకు కోటికి పైగా ఖర్చు చేయడం అవసరమా? అంటూ సోషల్ మీడియాలోనూ అటు వెబ్ సైట్లలోనూ తగని ఆరోపణలతో కూడిన రాద్ధాంతం రేగింది. అందుకు వైసీపీ సోషల్ ఆర్మీ కూడా ధీటుగా బదులిస్తుంది. అధికారికంగా మీడియాకు గుంటూరు జిల్లా కలెక్టర్ ప్రకటించిన వివరాలు మాత్రమే వెల్లడిస్తే... దాన్ని విమర్శిస్తూ.. కొన్ని సోషల్ ఎల్లో సైట్స్ మాత్రం విరుద్ధమైన విమర్శలు చేయడం తగదని సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు రేగుతున్నాయి. చూద్దాం ఈ విషయం ఎంతవరకు దారితీస్తుంది అనేది.