క్వార్టర్స్‌లో జకోవిచ్, హలెప్

SMTV Desk 2019-06-05 12:26:25  jacovich , halep,

పారిస్: ప్రతిష్టాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా), నాలుగో సీడ్ డొమినిక్ థి మ్ (ఆస్ట్రియా) క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్, మూడో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా), 14వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచుల్లో విజయం సాధించారు. ఆశ్లే బార్టీ (ఆస్ట్రేలియా), అలెగ్జాండర్ జ్వరెవ్ (జర్మనీ) కూడా ముందంజ వేశారు. ఇక, టాప్ సీడ్ జకోవిచ్ మరోసారి అలవోక విజయాన్ని అందుకున్నాడు. జర్మనీ ఆటగాడు జాన్ లెనార్డ్‌తో జరిగిన మ్యాచ్‌లో జకోవిచ్ 63, 62, 62తో విజయం సాధించాడు. ప్రారంభం నుంచే జకోవిచ్ చెలరేగి ఆడాడు. తనకు మాత్రమే సాధ్యమయ్యే ప్రత్యేక షాట్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. దూకుడుగా ఆడుతూ వరుసగా మూడు సెట్లను గెలుచుకుని క్వార్టర్స్ బెర్త్‌ను సొంతం చేసుకున్నాడు.

మరోవైపు థిమ్ కూడా ప్రిక్వార్టర్స్ సమరంలో సునాయాస విజయం సాధించాడు. ఫ్రాన్స్‌కు చెందిన 14వ సీడ్ గేల్ మోన్‌ఫీల్స్‌ను థిమ్ ఓడించాడు. ప్రారంభం నుంచే థిమ్ ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. చక్కటి షాట్లతో అలరించిన థిమ్ 64, 64, 62తో మోన్‌ఫీల్స్‌ను చిత్తు చేశాడు. కాగా, ఐదో సీడ్ జ్వరెవ్ కూడా క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించాడు. ప్రిక్వార్టర్ సమరంలో జ్వరెవ్ 36, 62, 62, 76తో 9వ సీడ్, ఇటలీ ఆటగాడు ఫాబియో ఫొగ్నినిను ఓడించాడు. మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ హలెప్ 61, 60తో పోలండ్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్‌ను చిత్తు చేసింది. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన హలెప్ ఏదశలోనూ ప్రత్యర్థికి తేరుకనే అవకాశం ఇవ్వలేదు. మరోవైపు ఆశ్లే బార్టీ 63, 36, 60తో అమెరికా క్రీడాకారిణి సోఫియా కెనిన్‌ను ఓడించింది. 14వ సీడ్ మాడిసన్ కీస్ కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఏకపక్షంగా సాగిన పోరులో కీస్ 62, 64తో చెక్‌కు చెందిన కటెరినా సినియాకొవాను చిత్తు చేసింది.