5జి స్పెక్ట్రమ్ వేలం కి రంగం సిద్ధం

SMTV Desk 2019-06-04 16:39:12  5g spectrum,

టెలికామ్ స్పెక్ట్రమ్ వేలం ఈ ఏడాదిలో నిర్వహించనున్నామని కేంద్ర టెలికామ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రస్తుత సంవత్సరంలో 5జి, రేడియా తరంగాలకు మెగా స్పెక్ట్రమ్ వేలం నిర్వహించనున్నామని, వచ్చే 100 రోజుల్లో 5జి ట్రయల్స్ ప్రారంభించనున్నామని అన్నారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే మంత్రిత్వశాఖ ఎజెండాలను సిద్ధం చేసింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సంక్షోభంలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలైన బిఎస్‌ఎన్‌ఎల్(భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్), ఎంటిఎన్‌ఎల్(మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్)ల పునరుద్ధరణకు ప్రాధాన్యతనిస్తానని అన్నారు.

అయితే ఇరు కంపెనీలు పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలని, వృత్తిపరమైన వైఖరిని అలవర్చుకోవాలని సూచించారు. 5జి ట్రయల్స్‌లోకి చైనా టెలికామ్ సంస్థ హువాయ్‌ను అనుమతించే విషయంపై మంత్రి స్పందించారు. భద్రతా పరణైన అంశాలను తీవ్రంగా పరిగణిస్తామని, వాటిని పరిష్కరిస్తామని అన్నారు. 5జి సేవలతో పాటు 8644 మెగాహెట్జ్ టెలికామ్ ప్రీక్వెన్సీ వేలాన్ని మొత్తం బేస్ ధర రూ.4.9 లక్షల కోట్లుగా ట్రాయ్(టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) సూచించగా, ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన టెలికామ్ సంస్థలు ఈ ధరను భరించలేమంటూ చేతులెత్తేశాయి.