సీక్రెట్ గా షూటింగ్ జరుపుకుంటున్న 'ఆర్ఆర్ఆర్‌' ?

SMTV Desk 2019-06-04 16:38:02  rrr,

బాహుబలి తర్వాత రాజమౌళి రూపుదిద్దుతున్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్‌ . మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందుతున్న ఈ భారీ మల్టీస్టారర్ సినిమాపై ఆసక్తిగా ఉన్నారు ప్రేక్షకులు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబందించి ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. చరణ్‌, ఎన్టీఆర్ లు గాయపడటంతో ఆర్ఆర్ఆర్ షెడ్యూల్స్ అన్నీ డిస్టర్బ్ అయ్యాయి. అంతేకాక అపట్లో హైదరాబాద్ లోని సినిమా షూటింగ్ సమయంలో కూడా ఎవరో కొన్ని ఫోటోలు తీసి నెట్ లో లీక్ చేశారు. అందుకే ఆర్ఆర్ఆర్ షూటింగ్ హైద్రాబాద్‌లోనే జరుగుతోన్నా ఎక్కడా దీనికి సంబందించిన అప్డేట్ లేకుండా చూసుకుంటున్నాడు జక్కన్న.

. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి కొమరం భీమ్ ఎన్టీఆర్ పై కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. కొమరమ్ భీమ్ గా ఎన్టీఆర్ బ్రిటీష్ సైన్యంతో తలపడే సన్నివేశాలను పెద్ద ఎత్తున చిత్రీకరించారని అంటున్నారు. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. జూలై 30 2020వ సంవత్సరంలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు.