బాబు సర్కారు బాగోతం... రూ. 18 లక్షల డ్రై ఫ్రూట్స్ స్వాహా

SMTV Desk 2019-06-04 16:28:57  18 lakhs dry fruts, chandrababu

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి. తాజాగా బాబు హయాంలో దుబారా ఖర్చులు పెరిగిపోయాయని, ఖర్చులను పెంచి చూపి, అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఓ ట్వీట్ చేశారు.

ఉన్నత విద్యా మండలిలో నలుగురు అధికారులు ప్రభుత్వ సొమ్ముతో ఏకంగా రూ.18 లక్షల ఖర్చు డ్రై ఫ్రూట్స్ తిన్నారని ఆరోపించారు. విజయ సాయి రెడ్డి ట్వీట్ పెడుతూ..”రాష్ట్రాన్ని విడగొట్టి కట్టుబట్టలతో తరిమారని ఏడ్చి పెడబొబ్బలు పెట్టిన వ్యక్తి దుబారా ఖర్చులు చూడండి. ఉన్నత విద్యామండలిలో నలుగురి డ్రైఫూట్స్ ఖర్చు18 లక్షలంట. విజనరీ, అనువజ్ణుడు, అభివృద్ధి పదగామి అని కుల మీడియా కీర్తించింది ఈయననే” అని అన్నారు.