కాళేశ్వరం పనులను పరిశీలిస్తున్న సిఎం కేసీఆర్‌

SMTV Desk 2019-06-04 16:08:44  Kaleshwram, cm kcr,

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జగిత్యాల జిల్లాలోని రాంపూర్ వద్ద నిర్మించబడుతున్న పంప్‌హౌస్‌ పనుల పురోగతిని పరిశీలించడానికి సిఎం కేసీఆర్‌ మంగళవారం ఉదయం రాంపూర్ చేరుకొన్నారు. సిఎం కేసీఆర్‌తో పాటు ఇరిగేషన్ అధికారులు, సీఎంవో స్మితా సబర్వాల్, మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్థానిక తెరాస ప్రజాప్రతినిధులు ఉన్నారు. త్వరలో వర్షాలు మొదలవబోతున్నందున వచ్చే నెల 15వ తేదీలోగా పంప్‌హౌస్‌లో అన్ని మోటర్లను బిగించి ఎత్తిపోతలకు సిద్దం చేయాలని సిఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఇక నుంచి ప్రతీ రెండురోజులకు ఒకసారి పంప్‌హౌస్‌ పనుల పురోగతిని తనకు తెలియజేయాలని సిఎం కేసీఆర్‌ మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఆదేశించారు. మరికొద్ది సేపటిలో సిఎం కేసీఆర్‌ రాంపూర్ నుంచి బయలుదేరి మేడిగడ్డ బ్యారేజికు చేరుకొంటారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించిన తరువాత మధ్యాహ్నం 12.30 గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ తిరిగి బయలుదేరుతారని సమాచారం.