పిల్లలు పుట్టడం లేదని, 7 నెలల శిశువుని

SMTV Desk 2017-06-03 16:14:59  child Sacrifice, jarkand

హైదరాబాద్, జూన్ 3 : సంతానం కోసం మంత్రగాడి మాటలు విని అమాయకురాలైన 7 నెలల చిన్నారిని నరబలి ఇచ్చాడో వ్యక్తి. జార్ఖండ్ లోని సేరైకేలా - ఖర్స్వాన్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. బదోయ్ కాళింది అనే వ్యక్తి పాములు ఆడిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకి సంతానం లేకపోవడంతో తాంత్రికుడైన కర్మూను ఆశ్రయించాడు. పిల్లలు పుట్టాలంటే నరబలి ఇవ్వాలని కర్మూ చెప్పాడు. మే 26 రాత్రి కర్మూ, బదోయ్ తో కలసి తన ఇంటి దగ్గరలో నివసించే సుభాష్ గొపే ఏడు నెలల కుమార్తె నిద్రిస్తుండగా అపహరించారు. తిరుల్దీ గ్రామ సమీపంలోని నదీతీరంలో నరబలి ఇచ్చారు. తర్వాత కర్మూ కనిపించకుండా పోవడంతో బాలిక అపహరణలో అతని పాత్ర ఉందని అనుమానించిన పోలీసులు గాలిపు జరిపి కర్మూ, భధోయ్ లను అరెస్ట్ చేశారు. గురువారం వారిద్దరూ నేరాన్ని అంగీకరించారు. బదోయ్ నివాసం నరబలికి ఉపయోగించిన ఆయుధాన్ని సీజ్ చేశారు. బాలిక మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు.