కాంగ్రెస్, బీజేపీల మధ్య రసవత్తర పోరు

SMTV Desk 2019-06-04 16:06:33  congress, Bjp,

గోవా స్పీకర్ పదవికి కాంగ్రెస్, బీజేపీల మధ్య రసవత్తర పోరు తప్పేటట్టు లేదు. బీజేపీ నుంచి బిచోలిమ్ శాసనసభ్యుడు రాజేష్ పాట్నేకర్ సీఎం ప్రమోద్ సావంత్, డిప్యూటీ సీఎం విజయ్ సర్దేశాయ్ ల సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు. అటు..కాంగ్రెస్ నుంచి ప్రతాప్ సింగ్ రాణే నామినేషన్ దాఖలు చేశారు. కాగా స్పీకర్ పదవికి రాణే సరైన వ్యక్తి అని ప్రతిపక్ష నేత చంద్రకాంత్ కావ్లేకర్ అన్నారు. అయితే 40 మంది శాసనసభ్యులున్న గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ కు 15 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అటు.బీజేపీకిఇదే విషయాన్ని శాసనసభ్యులను కోరతామని అన్నారు. ప్రస్తుత సీఎం, మాజీ స్పీకర్ ప్రమోద్ సావంత్ సీఎం పదవి వరించడంతో ఖాళీ అయిన స్పీకర్ పదవికి రేపు ఎన్నిక జరుగనుంది.