అడివి శేష్ 'ఎవరు'..?

SMTV Desk 2019-06-04 16:04:10  adivi sesh, ewaru,

క్షణం, గూఢచారి సినిమాలతో సూపర్ సెన్సేషన్స్ క్రియేట్ చేసిన అడివి శేష్ అంతకుముందు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాని క్రేజ్ ఈ రెండు సినిమాలతో వచ్చింది. లేటెస్ట్ గా అడివి శేష్ హీరోగా వస్తున్న సినిమా ఎవరు. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ ఈరోజు రిలీజ్ చేశారు. వెంకట్ రాంజి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అడివి శేష్ కు జోడీగా రెజినా కసాండ్ర నటిస్తుంది. పివిపి బ్యానర్ లో ఈ సినిమా రూపొందిస్తున్నారు.

సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో పెద్దగా క్లూ వదలలేదు దర్శకుడు. రక్తపు మరకలతో ఉన్న గ్లాస్.. వర్షం లో కారు గ్లాస్ అవతల పోలీస్ వెహికల్ ఆగి ఉండటం ఇలా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమాపై ఓ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. అడివి శేష్ చేస్తున్నాడు అంటే అది కచ్చితంగా ప్రయోగమే అనేంతగా తన మార్క్ వేసుకున్నాడు. మరి ఎవరు అసలు కథ ఏంటన్నది తెలియాలంటే ఆగష్టు 23న తెలుస్తుంది.