బ్రేకింగ్ .. సెట్స్ లో నానికి యాక్సిడెంట్

SMTV Desk 2019-06-04 16:03:18  Nani,

నాచురల్ స్టార్ నాని ప్రమాదానికి గురయ్యారని వార్త సంచలనానికి తెరలేపింది. ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ అనే సినిమా చేస్తున్న నాని ఈ సినిమా షూట్ సమయంలో గాయపడ్డారని తెలిసింది. ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో నానికి చిన్న యాక్సిడెంట్ జరిగిందని సమాచారం. చిన్న యాక్సిడెంట్ కావడంతో ఆయన కాలికి కూడా గాయమైనట్లు తెలుస్తోంది. అయితే సెట్స్ లో ఉండగానే నానికి యాక్సిడెంట్ కావడంతో వెంటనే అప్రమత్తమైన యూనిట్ సభ్యులు ఆయనను దగ్గరలోని ఆసుపత్రిలో జాయిన్ చేశారట.

నాని గాయాన్ని పరిశీలించిన డాక్ట‌ర్లు ప్ర‌మాదం ఏం లేద‌ని చెప్ప‌డంతో ఊపిరి పీల్చుకున్నారట మేకర్స్. అయితే ప్రమాదం చిన్నది కావడంతో ఈ విషయాన్ని బయటకు తెలియకుండా జాగ్రత్త పడ్డారని సమాచారం. ఈ యాక్సిడెంట్ కారణంగా కొన్ని రోజుల పాటు షూటింగ్ క్యాన్సిల్ చేశారు. 10 రోజులు విశ్రాంతి అనంతరం మళ్లీ సెట్స్ మీదకు వెళ్లనుంది ఈ సినిమా. గ్యాంగ్ లీడర్ సినిమాలో నాని ఐదుగురు ఆడ దొంగల బ్యాచ్ కి బాస్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మరికొద్ది రోజుల్లోనే షూటింగ్ ఫినిష్ చేసుకోనుంది.